విదేశీ గడ్డపై పాకిస్థాన్ హాకీ జట్టుకు ఘోర అవమానం హోటల్ బిల్లు కట్టలేక రోడ్డుపై గడిపిన ఆటగాళ్లు

విదేశీ గడ్డపై పాకిస్థాన్ హాకీ జట్టుకు ఘోర అవమానం హోటల్ బిల్లు కట్టలేక రోడ్డుపై గడిపిన ఆటగాళ్లు

ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో పాల్గొనేందుకు వెళ్ళిన పాకిస్థాన్ జాతీయ హాக்கி జట్టు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ సకాలంలో హోటల్ బిల్లులు చెల్లించకపోవడంతో కాన్బెర్రాలో క్రీడాకారుల బుకింగ్‌ను యాజమాన్యం రద్దు చేసింది. దీనివల్ల గత్యంతరం లేక ఆటగాళ్లు అర్ధరాత్రి వేళ రోడ్లపై గడపాల్సిన దుస్థితి ఏర్పడింది.

స్థానిక పాకిస్థానీయుల సహకారంతో వసతి దొరికినప్పటికీ, ఒకే గదిలో అందరూ కిక్కిరిసి ఉండాల్సి వచ్చింది. ఈ మానసిక ఒత్తిడి కారణంగా మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ ఓటమి పాలైంది. గతంలో అర్జెంటీనా పర్యటనలో కూడా ఈ జట్టు ఇలాంటి అవమానకర పరిస్థితులను ఎదుర్కొంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *