మాజీ సైన్యాధిపతి పుస్తకంపై చెలరేగుతున్న వివాదం మరియు రక్షణ శాఖ కార్యదర్శి స్పందన
February 14, 2026

మాజీ సైన్యాధిపతి ఎం.ఎం. నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. రాహుల్ గాంధీ ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తుండగా, ఢిల్లీ పోలీసులు ఇప్పటికే పబ్లిషింగ్ హౌస్కు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టారు.
ఈ నేపథ్యంలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ సైనిక అధికారులు పుస్తకాలు రాయడానికి కొత్త నిబంధనలు అవసరం లేదని పేర్కొన్నారు. అధికారిక రహస్యాల చట్టం ఇప్పటికే అమలులో ఉందని ఆయన స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించి ఏవైనా అంశాలు చేర్చారా అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు.