వింటర్ ఒలింపిక్స్‌లో అనూహ్య ఘటనగా మారిన కండోమ్‌ల కొరత
February 13, 2026

2026 మిలన్-కోర్టినా వింటర్ ఒలింపిక్ క్రీడాకారుల గ్రామంలో కండోమ్‌ల నిల్వలు నిండుకోవడంతో కలకలం రేగుతోంది. సుమారు 2,900 మంది అథ్లెట్ల కోసం కేటాయించిన 10,000 కండోమ్‌ల ప్యాకెట్లు కేవలం మూడు రోజుల్లోనే ఖాళీ అయ్యాయి. ఇంత భారీ స్థాయిలో డిమాండ్ పెరగడంతో ప్రస్తుతం ఏం చేయాలో తెలియక నిర్వాహకులు సతమతమవుతున్నారు.
సురక్షితమైన లైంగిక ఆరోగ్యం కోసం ఒలింపిక్ గ్రామంలో ఉచితంగా కండోమ్‌లను అందించే సంప్రదాయం ఉంది. అయితే గత పారిస్ లేదా టోక్యో ఒలింపిక్స్‌తో పోలిస్తే ఇక్కడ నిల్వలు తక్కువగా ఉండటంతో ఈ కొరత ఏర్పడింది. వెంటనే అదనపు స్టాక్‌ను తెప్పిస్తామని నిర్వాహకులు ప్రకటించినప్పటికీ ఈ విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.