లాంచ్ కాకముందే లీకైన వివో వి 70 సిరీస్ ధర మరియు అద్భుతమైన ఫీచర్లు
February 13, 2026

భారత మార్కెట్లో ఫిబ్రవరి 19న విడుదల కానున్న వివో వి 70 మరియు వి 70 ఎలైట్ స్మార్ట్‌ఫోన్ల ధరలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వివో వి 70 బేస్ మోడల్ ధర రూ. 45,999 నుండి ప్రారంభం కావచ్చని, దీని ప్రీ-బుకింగ్ ఫిబ్రవరి 24 వరకు అందుబాటులో ఉంటుందని సమాచారం.
ఈ సిరీస్‌లో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ మరియు జైస్ కెమెరా సెటప్‌ను అందించారు. వి 70 ఎలైట్ మోడల్‌లో 6,500 mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు ఫోటోగ్రఫీ కోసం 50MP నైట్ టెలిఫోటో లెన్స్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉండటం విశేషం.