భారత్ అడుగుజాడల్లో బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వానికి చైనా శుభాకాంక్షలు

భారత్ అడుగుజాడల్లో బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వానికి చైనా శుభాకాంక్షలు

బంగ్లాదేశ్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనల తర్వాత చైనా కూడా తన మద్దతును ప్రకటించింది. అక్కడ కొలువుదీరిన బీఎన్‌పీ కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు షీ జిన్‌పింగ్ సర్కార్ సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఢాకాలోని చైనా రాయబార కార్యాలయం తమ ఫేస్‌బుక్ వేదికగా బంగ్లాదేశ్ ప్రజలకు మరియు కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపింది.

భారత్‌తో పోటీగా బంగ్లాదేశ్‌పై తమ ప్రభావాన్ని పెంచుకోవాలని చైనా భావిస్తోంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందని చైనా రాయబార కార్యాలయం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ పరిణామం ఆసియా రాజకీయాల్లో కీలకంగా మారింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *