పండిట్ రవిశంకర్ పాత్రలో హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఫర్హాన్ అక్తర్
February 13, 2026

ఆస్కార్ విజేత సామ్ మెండిస్ దర్శకత్వంలో రూపొందుతున్న ది బీటిల్స్ బయోపిక్ ద్వారా ఫర్హాన్ అక్తర్ హాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో దిగ్గజ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ పాత్రను ఆయన పోషించనున్నట్లు సోనీ పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా ధృవీకరించింది.
ముఖ్యంగా జార్జ్ హారిసన్ మరియు రవిశంకర్ మధ్య ఉన్న విడదీయలేని స్నేహబంధం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. హాలీవుడ్ ప్రముఖులతో కూడిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.