ఎన్నికల వేళ మహిళల ఖాతాల్లో 5000 రూపాయలు జమ చేస్తూ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం

ఎన్నికల వేళ మహిళల ఖాతాల్లో 5000 రూపాయలు జమ చేస్తూ సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 1.31 కోట్ల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి 5,000 రూపాయలను జమ చేశారు. ఇందులో మూడు నెలల ముందస్తు నగదుతో పాటు ప్రత్యేక సమ్మర్ బోనస్ కూడా ఉంది. శుక్రవారం ఉదయం మొత్తం 6,550 కోట్ల రూపాయలను ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేసింది.

మహిళల హక్కులను గౌరవించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టాలిన్ పేర్కొన్నారు. తిరిగి అధికారంలోకి వస్తే నెలవారీ గౌరవ వేతనాన్ని 1,000 నుండి 2,000 రూపాయలకు పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ఈ ‘ద్రావిడ మోడల్ 2.0’ వ్యూహం కీలకంగా మారనుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *