దేశంలోని ఐఏఎస్ మరియు ఐపీఎస్ సర్వీసుల్లో ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీల వాటా ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
February 13, 2026

గత ఐదేళ్లలో ఐఏఎస్ మరియు ఐఎఫ్ఎస్ అధికారుల కంటే ఐపీఎస్ విభాగంలోనే ఓబీసీ, ఎస్సీ మరియు ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు ఎక్కువగా నియమితులయ్యారని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. 2020 నుండి 2024 వరకు ఈ మూడు ప్రతిష్టాత్మక సర్వీసుల్లో రిజర్వ్డ్ వర్గాల నుండి మొత్తం 1,288 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఐపీఎస్ విభాగంలో అత్యధికంగా 467 మంది నియామకం పొందారు.
అయితే యూపీఎస్సీ నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం 2025 జనవరి నాటికి దేశవ్యాప్తంగా 1,300 ఐఏఎస్ మరియు 505 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటవీ సర్వీసులో అత్యధికంగా 1,029 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.