పాకిస్థాన్ మ్యాచ్‌కు దూరం కానున్న స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ
February 13, 2026

అనారోగ్యం కారణంగా టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ బరువు తగ్గడంతో పాటు తీవ్ర నీరసానికి గురయ్యారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ ఆయన ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదని అర్ష్‌దీప్ సింగ్‌తో మాట్లాడిన వీడియో ద్వారా స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఆయన కేవలం తేలికపాటి ఆహారం తీసుకుంటున్నారు.
ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌లో అభిషేక్ ఆడటంపై సందిగ్ధత నెలకొంది. అతను కోలుకోవడానికి మరికొంత సమయం పట్టవచ్చని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. దీంతో పాకిస్థాన్ లాంటి హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఈ విధ్వంసకర బ్యాటర్ అందుబాటులో ఉంటారో లేదో చూడాలి.