ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్ చర్చలకు రాకుంటే పరిస్థితి తీవ్రమే

ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్ చర్చలకు రాకుంటే పరిస్థితి తీవ్రమే

ఇరాన్ వెంటనే అణు ఒప్పందానికి అంగీకరించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. వాషింగ్టన్‌లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో జరిపిన కీలక భేటీ అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన ‘మిడ్‌నైట్ హామర్’ దాడులను గుర్తు చేస్తూ, ఇరాన్ చర్చలకు రాకుంటే తదుపరి చర్యలు మరింత బాధాకరంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో అంతిమ నిర్ణయం తనదేనని ఆయన తేల్చి చెప్పారు.

మరోవైపు, ఇరాన్‌పై ఒత్తిడి పెంచి ఒక మంచి ఒప్పందానికి దారికి తీసుకురావచ్చని ట్రంప్ భావిస్తున్నట్లు నెతన్యాహు తెలిపారు. కేవలం అణు అంశాలే కాకుండా, బాలిస్టిక్ క్షిపణులు మరియు ప్రాంతీయ ఉగ్రవాద అంశాలను కూడా ఒప్పందంలో చేర్చాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. ఇరాన్ వైఖరి మారకుంటే కఠిన చర్యలు తప్పవని అమెరికా సంకేతాలిస్తుండటంతో, ఇప్పుడు ప్రపంచం దృష్టి పశ్చిమ ఆసియాపై పడింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *