ఐపీఎల్ ఫిక్సింగ్ కేసులో ధోనీకి 10 లక్షల రూపాయలు చెల్లించాలని కోర్టు ఆదేశం
February 13, 2026

ఐపీఎల్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఐపీఎస్ అధికారి జి. సంపత్ కుమార్‌పై దాఖలైన పరువు నష్టం కేసులో మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి మహేంద్ర సింగ్ ధోనీ 10 లక్షల రూపాయలు జమ చేయాలని కోర్టు పేర్కొంది. గతంలో తనపై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా ధోనీ 100 కోట్ల రూపాయల దావా వేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ మొత్తం జరిమానా కాదు, కేవలం కేసు పత్రాలు మరియు సీడీల అనువాద ఖర్చుల కోసమేనని కోర్టు స్పష్టం చేసింది. అనువాదకులు మరియు టైపిస్టుల వేతనాల నిమిత్తం ఈ నిధులను వెచ్చించాలని ధోనీని కోరింది. ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన ఈ పరిణామం క్రీడారంగంలో హాట్ టాపిక్‌గా మారింది.