భారత గగనతలంలో రఫెల్ యుద్ధ విమానాల గర్జన పొరుగు దేశాలకు వణుకు

భారత గగనతలంలో రఫెల్ యుద్ధ విమానాల గర్జన పొరుగు దేశాలకు వణుకు

భారత వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు 114 అత్యాధునిక రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు రక్షణ కొనుగోలు మండలి ప్రాథమిక ఆమోదం తెలిపింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దాదాపు 3.25 లక్షల కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీనివల్ల పాత విమానాల స్థానంలో కొత్తవి చేరడమే కాకుండా 42 స్క్వాడ్రన్ల లక్ష్యం నెరవేరుతుంది.

‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా ఈ విమానాలు భారత్‌లోనే తయారవుతాయి. అణు ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ యుద్ధ విమానాలు సరిహద్దు ఉద్రిక్తతల వేళ భారత వ్యూహాత్మక శక్తిని మరింత పెంచుతాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *