ఎర్రకోట దాడి వెనుక జైషే హస్తం ఐక్యరాజ్యసమితి నివేదికలో వెల్లడి
February 13, 2026

గత ఏడాది నవంబర్ 9న ఢిల్లీలోని ఎర్రకోట పరిసరాల్లో జరిగిన ఉగ్రదాడి వెనుక జైషే మహ్మద్ హస్తం ఉందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఈ దాడుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోగా, భారత వాదనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ ఉగ్ర ముఠా కార్యకలాపాలపై ఐరాస నివేదిక కీలక అంశాలను వెల్లడించింది.
ముఖ్యంగా జైషే చీఫ్ మసూద్ అజార్ మహిళలతో కూడిన ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ‘జమాత్-ఉల్-ముమినాత్’ పేరుతో మహిళా ఉగ్రవాదులను తయారు చేస్తూ, ఆయుధాల సరఫరా మరియు రిక్రూట్‌మెంట్ కోసం వారిని ఉపయోగిస్తున్నారని సమాచారం. నిఘా సంస్థల కళ్లుగప్పి కార్యకలాపాలు సాగించేందుకే ఉగ్ర సంస్థలు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.