సౌత్ బ్లాక్ ఇక చరిత్ర! ‘సేవా తీర్థం’ నుంచే దేశ పరిపాలన సాగించనున్న ప్రధాని మోదీ

సౌత్ బ్లాక్ ఇక చరిత్ర! ‘సేవా తీర్థం’ నుంచే దేశ పరిపాలన సాగించనున్న ప్రధాని మోదీ

దాదాపు 79 ఏళ్ల సుదీర్ఘ చారిత్రక ప్రస్థానం తర్వాత, ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఢిల్లీలోని సౌత్ బ్లాక్ నుండి సెంట్రల్ విస్టాలోని కొత్త ప్రాంగణానికి మారింది. ‘సేవా తీర్థం’గా పిలిచే ఈ అత్యాధునిక కాంప్లెక్స్‌లోని మూడు భవనాల నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇకపై పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. బ్రిటిష్ కాలం నాటి వారసత్వాన్ని వీడి, ప్రజాసేవయే పరమావధిగా ఈ మార్పు జరిగింది.

ఈ కొత్త ప్రాంగణంలో పిఎమ్‌ఓతో పాటు క్యాబినెట్ సెక్రటేరియట్ మరియు జాతీయ భద్రతా సలహాదారు కార్యాలయాలు కూడా కొలువుదీరాయి. వీటితో పాటు పలు కీలక కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా కర్తవ్య భవన్‌కు తరలించారు. ఈ చారిత్రక మార్పు భారత పరిపాలనా వ్యవస్థలో ఒక కొత్త శకానికి నాంది పలికింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *