ఆస్ట్రేలియా గడ్డపై పాక్ హాకి ఆటగాళ్లకు ఘోర అవమానం

ఆస్ట్రేలియా గడ్డపై పాక్ హాకి ఆటగాళ్లకు ఘోర అవమానం

ఆస్ట్రేలియాలో ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ ఆడేందుకు వెళ్లిన పాకిస్థాన్ హాకీ జట్టుకు ఊహించని పరాభవం ఎదురైంది. పాకిస్థాన్ స్పోర్ట్స్ బోర్డ్ మరియు హాకీ ఫెడరేషన్ హోటల్ అద్దె చెల్లించకపోవడంతో, ఆటగాళ్లు తమ సామాన్లతో వీధుల్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. సుదీర్ఘ ప్రయాణంతో అలసిపోయిన జాతీయ జట్టు క్రీడాకారులు హోటల్ బయటే గంటల తరబడి నిలబడటం క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశమైంది.

కోచ్ తాహిర్ జమాన్ పాక్ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ సమయ వ్యత్యాసం వల్ల సాధ్యపడలేదు. చివరకు సమస్య పరిష్కారమైనా ఆటగాళ్లకు తగినన్ని గదులు లభించలేదు. దీంతో ఒకే గదిలో ముగ్గురు ఆటగాళ్లు ఇరుకుగా గడపాల్సి వస్తోంది. ఆర్థిక సంక్షోభం కారణంగా విదేశీ గడ్డపై దేశ ప్రతిష్ట మసకబారడం పట్ల క్రీడాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *