ఓటరు జాబితాలో పేరు లేదా? ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన

ఓటరు జాబితాలో పేరు లేదా? ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన

ఓటరు జాబితా (ASDD) నుండి పేర్లు తొలగించబడిన వారు కూడా కొన్ని షరతులతో ఓటు వేయవచ్చని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఓటర్లు తగిన గుర్తింపు కార్డులతో పోలింగ్ కేంద్రానికి వెళ్లి, ప్రిసైడింగ్ అధికారి సమక్షంలో డిక్లరేషన్ ఫారమ్ నింపడం ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అయితే, తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ హెచ్చరించారు.

మరోవైపు, ఓటర్ల జాబితా పరిశీలన కోసం సుప్రీంకోర్టు ఆదేశించిన పూర్తిస్థాయి సిబ్బంది ఇంకా విధుల్లో చేరలేదని కమిషన్ తెలిపింది. కేటాయించిన 8,805 మంది అధికారుల్లో కేవలం 6,000 మంది మాత్రమే ఇప్పటివరకు రిపోర్ట్ చేశారు. డార్జిలింగ్, అలీపుర్‌దువార్ మినహా మిగిలిన జిల్లాల నుండి నివేదికలు అందకపోవడంపై కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *