పాకిస్థాన్‌కు చుట్టుముడుతున్న దౌత్య సంక్షోభం, మోదీ వ్యూహంతో అంతర్జాతీయ వేదికపై ఒంటరవుతున్న ఇరుగుపొరుగు దేశం

అంతర్జాతీయ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాలు పాకిస్థాన్‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేస్తున్నాయి. ఒకప్పుడు పాకిస్థాన్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఖతార్, టర్కీ మరియు అమెరికా వంటి దేశాలు ఇప్పుడు దూరమవుతున్నాయి. ఖతార్‌కు చెందిన అల్ జజీరా ఇటీవల భారత పూర్తి మ్యాప్‌ను ప్రదర్శించడమే కాకుండా, బలూచ్ వేర్పాటువాదులకు వేదికనివ్వడం పాకిస్థాన్‌ను విస్మయానికి గురిచేసింది. మరోవైపు, అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు సైతం పాక్ మాట వినకుండా భారత్, చైనా మరియు రష్యాలతో నేరుగా సంబంధాలను ఏర్పరచుకుంటున్నారు. పాకిస్థాన్‌లో చైనా ఇంజనీర్లపై జరుగుతున్న దాడుల పట్ల చైనా తీవ్ర అసంతృప్తితో ఉండటం, పెట్టుబడులను తగ్గించుకోవడం ఆ దేశాన్ని మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది.
శత్రువును నేరుగా ఓడించడం కంటే, వారికి అందే బాహ్య మద్దతును నిలిపివేయాలనే ప్రధాని మోదీ దౌత్య వ్యూహం ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది. పాకిస్థాన్ అప్పుల్లో కూరుకుపోయి పొరుగు దేశాలతో ఘర్షణ పడుతుంటే, భారత్ ఆయా దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. ఒకప్పుడు పాకిస్థాన్‌ను బలంగా సమర్థించిన టర్కీ సైతం ఇప్పుడు తన గళాన్ని మార్చుకుంది. ‘ఇస్లామిక్ నాటో’ కలలు కరిగిపోగా, అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను ఒంటరి చేయడంలో మోదీ దౌత్యం విజయం సాధించిందని విశ్లేషకులు భావిస్తున్నారు. శత్రువు తన స్వయంకృత అపరాధాల వల్లే నాశనమయ్యేలా భారత్ వేసిన అడుగులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి.