స్నానాల గదిలో పొంచి ఉన్న సైలెంట్ హార్ట్ ఎటాక్ ముప్పు, ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం

స్నానాల గదిలో పొంచి ఉన్న సైలెంట్ హార్ట్ ఎటాక్ ముప్పు, ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం

స్నానం చేసే సమయంలో మన శరీరం ఇచ్చే కొన్ని సూచనలు గుండెపోటుకు సంకేతాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్నానం చేస్తున్నప్పుడు లేదా చేసిన తర్వాత వాతావరణం చల్లగా ఉన్నా శరీరం విపరీతంగా చెమటలు పట్టడం, ముఖ్యంగా నుదురు లేదా పై పెదవిపై చల్లని చెమట రావడం గుండె సమస్యకు ప్రధాన లక్షణం. అలాగే స్నానపు గదిలో అకస్మాత్తుగా తల తిరగడం, కళ్లు బైర్లు కమ్మడం లేదా బ్యాలెన్స్ తప్పడం వంటివి జరిగితే అది గుండెకు రక్త ప్రసరణ తగ్గుతుందని అర్థం చేసుకోవాలి. స్వల్ప పనికే అలసట రావడం లేదా శరీరానికి ఎడమ వైపున ఒత్తిడిగా అనిపించినా అప్రమత్తంగా ఉండాలి.

శరీర ఉష్ణోగ్రతకు, స్నానం చేసే నీటి ఉష్ణోగ్రతకు మధ్య తేడా ఉండటం వల్ల రక్తపోటుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా తెల్లవారుజామున లేదా రాత్రి వేళల్లో నేరుగా తలపై చల్లని నీళ్లు పోసుకోవడం వల్ల రక్త నాళాలు కుంచించుకుపోయి హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. బకెట్ ఎత్తినప్పుడు లేదా కదులుతున్నప్పుడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలిగితే అది గుండె సరిగ్గా రక్తాన్ని పంపింగ్ చేయలేకపోవడానికి నిదర్శనం. ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ప్రాణరక్షణకు ఎంతో కీలకం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *