మోదీ భారత్‌ను విదేశాలకు అమ్మేస్తున్నారు, ఎప్స్టీన్ ఫైల్స్ మరియు డేటా చోరీపై పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

మోదీ భారత్‌ను విదేశాలకు అమ్మేస్తున్నారు, ఎప్స్టీన్ ఫైల్స్ మరియు డేటా చోరీపై పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రపంచం యుద్ధ వాతావరణంలో ఉన్న వేళ, భారత్ తన అత్యంత విలువైన ‘డేటా’ను విదేశీ శక్తుల చేతుల్లో పెడుతోందని ఆయన ఆరోపించారు. ‘జుజుట్సు’ యుద్ధ కళను ఉదాహరణగా చూపుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఇంధనంగా మారిన భారతీయ డేటా రక్షణపై బడ్జెట్‌లో ఎలాంటి స్పష్టత లేదని విమర్శించారు. ప్రధాని మోదీ ‘యుద్ధ యుగం ముగిసింది’ అని చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని, ప్రపంచవ్యాప్తంగా అస్థిరత పెరుగుతోందని రాహుల్ పేర్కొన్నారు.

అమెరికా వ్యాపారవేత్త ఎప్స్టీన్ ఫైల్స్‌లో అనిల్ అంబానీ పేరు ఉందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సభలో ప్రకంపనలు సృష్టించాయి. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ద్వారానే అంబానీకి ఎప్స్టీన్‌తో పరిచయం జరిగిందని, ఇంత జరుగుతున్నా అంబానీ ఎందుకు జైల్లో లేరని ఆయన ప్రశ్నించారు. అమెరికా సుంకాల విధానం వల్ల భారతీయ వస్తువులపై పన్నులు భారీగా పెరిగాయని, ఇది రైతులకు శాపమని మండిపడ్డారు. డాలర్ ఆధిపత్యం కోసం భారత్ తన డేటాను మరియు దేశ ప్రయోజనాలను అమెరికాకు అప్పగిస్తోందని, ప్రధాని మోదీ భారత్‌ను అమ్మకానికి పెట్టారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *