మీ జాతకాన్ని మార్చే గంగాజల శక్తి, ఈ చిన్న పరిహారాలతో కష్టాలన్నీ మటుమాయం

హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం గంగాజలం అమృతంతో సమానం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతిరోజూ శివునికి గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల మోక్షం లభిస్తుంది. ఉద్యోగ సమస్యలు లేదా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ఇత్తడి పాత్రలో గంగాజలాన్ని తీసుకుని అందులో బిల్వపత్రం, తామరపువ్వు వేసి భోళానాథునికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని, వృత్తిపరమైన ఆటంకాలు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
తీరని అప్పుల బాధతో ఇబ్బంది పడేవారు ఒక ఇత్తడి బాటిల్‌లో గంగాజలాన్ని నింపి తమ పడకగదిలోని ఈశాన్య మూలలో ఉంచడం వల్ల త్వరలోనే రుణవిముక్తి కలుగుతుంది. అదేవిధంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు రోజూ గంగాజలాన్ని సేవించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శాస్త్రీయంగా కూడా గంగాజలం అత్యంత పవిత్రమైనదని నిరూపితమైంది కాబట్టి, ఇంట్లో ఎల్లప్పుడూ ఒక పాత్రలో గంగాజలాన్ని ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తి దూరమై సంపద పెరుగుతుంది.