హిందూ సమాజంపై అనుచిత వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వీడియోలు చేసిన అమ్రోహా ‘భాభీజాన్’ అరెస్ట్

హిందూ సమాజంపై అనుచిత వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వీడియోలు చేసిన అమ్రోహా ‘భాభీజాన్’ అరెస్ట్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమ్రోహా జిల్లాలోని సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల సమ్రీన్ నిషా అలియాస్ ‘భాభీజాన్’ హిందూ సమాజం మరియు మహిళలపై అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది. బహిరంగంగా నరికివేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతూ ఆమె చేసిన ఈ వీడియో వైరల్ కావడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. దీనిపై ప్రతీక్ శర్మ అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టినందుకు అమ్రోహా పోలీసులు ఆమెపై కఠిన చర్యలు తీసుకున్నారు.

ఈ ఘటనపై తీవ్ర దుమారం రేగడంతో సమ్రీన్ నిషా మరో వీడియో ద్వారా క్షమాపణలు చెప్పి, పాత వీడియోను తొలగించినట్లు పేర్కొన్నప్పటికీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. అమ్రోహా దేహాత్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 299 మరియు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. సమాజంలో అశాంతిని కలిగించేలా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడితే ఉపేక్షించేది లేదని, శాంతిభద్రతలను కాపాడటమే తమ ప్రాధాన్యతని పోలీసులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *