పదో తరగతి ఫెయిల్ అయిన ఆటో డ్రైవర్ సంచలనం, జైపూర్ వీధుల నుండి స్విట్జర్లాండ్‌ వరకు అద్భుత ప్రయాణం

పదో తరగతి ఫెయిల్ అయిన ఆటో డ్రైవర్ సంచలనం, జైపూర్ వీధుల నుండి స్విట్జర్లాండ్‌ వరకు అద్భుత ప్రయాణం

జైపూర్‌కు చెందిన రంజిత్ సింగ్ రాజ్ జీవితం నిజంగా ఒక సినిమాని తలపిస్తుంది. పేదరికం, సామాజిక వివక్షను ఎదుర్కొంటూ కేవలం 16 ఏళ్ల వయసులోనే ఆటో డ్రైవర్‌గా మారిన రాజ్, తన పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. విదేశీ పర్యాటకులతో మాట్లాడటం కోసం ఇంగ్లీష్ నేర్చుకున్న క్రమంలో ఒక విదేశీ మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. వీసా కోసం అనేక ప్రయత్నాలు విఫలమైనా, ఏకంగా ఫ్రెంచ్ ఎంబసీ ముందు ధర్నా చేసి విజయం సాధించారు. 2014లో వివాహం చేసుకుని విదేశాలకు పయనమైన రాజ్ జీవితం అక్కడితో పూర్తిగా మారిపోయింది.

ప్రస్తుతం రంజిత్ స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో స్థిరపడి ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తున్నారు. ఫ్రెంచ్ భాషలో ప్రావీణ్యం సంపాదించిన ఆయన, సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ నడుపుతూ పర్యాటక విశేషాలను పంచుకుంటున్నారు. భవిష్యత్తులో సొంతంగా రెస్టారెంట్ ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు వచ్చినా సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చని రాజ్ నిరూపించారు. జైపూర్ ఆటో డ్రైవర్ నుండి జెనీవా వాసిగా మారిన ఆయన కథ ఎంతో మంది యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *