ఫీజు బకాయిల చెల్లింపులో కీలక మలుపు, నేరుగా కాలేజీల ఖాతాల్లోకే నిధులు

ఫీజు బకాయిల చెల్లింపులో కీలక మలుపు, నేరుగా కాలేజీల ఖాతాల్లోకే నిధులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 1,200 కోట్ల బకాయిలను నేరుగా కళాశాలల ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధుల విడుదలతో విద్యా సంస్థలకు కొంత ఉపశమనం లభించనుంది. అయితే, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంకా రూ. 1,500 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పెండింగ్‌లో ఉన్న ఈ రూ. 1,500 కోట్ల నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ తీరుపై కళాశాల యాజమాన్యాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా కోర్సులు పూర్తి చేసుకుని బయటకు వెళ్ళిపోయిన విద్యార్థుల నుండి ఫీజులను ఎలా వసూలు చేయాలనే అంశంపై కళాశాలలు ఆందోళన చెందుతున్నాయి. తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తే, ఆ నిధులు తిరిగి కాలేజీలకు సక్రమంగా అందుతాయా లేదా అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో విద్యా సంస్థల ప్రతినిధులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *