లండన్ హోటల్‌లో డిన్నర్ చేసిన యువకుడికి షాక్, ఒక్క రాత్రిలోనే ఖాళీ అయిన బ్యాంక్ అకౌంట్

లండన్ హోటల్‌లో డిన్నర్ చేసిన యువకుడికి షాక్, ఒక్క రాత్రిలోనే ఖాళీ అయిన బ్యాంక్ అకౌంట్

లండన్‌లోని అత్యంత ఖరీదైన ‘నుస్రత్-ఎట్ స్టీక్‌హౌస్’ రెస్టారెంట్‌కు తన స్నేహితులతో కలిసి డిన్నర్‌కు వెళ్లిన జమీల్ అమీన్ అనే వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. భోజనం ముగించిన తర్వాత బిల్లు చూసి అతను అవాక్కయ్యాడు. మొత్తం బిల్లు 1,812 పౌండ్లు కాగా, భారతీయ కరెన్సీలో దీని విలువ అక్షరాలా 1.82 లక్షల రూపాయలకు పైమాటే. కేవలం ఒకే ఒక ఆహార పదార్థం ధర 63 వేల రూపాయలుగా ఉండగా, నాలుగు ఎనర్జీ డ్రింక్స్‌కు 44 పౌండ్లు వసూలు చేశారు. అంతేకాకుండా, సర్వీస్ ఛార్జ్ పేరుతోనే సుమారు 24 వేల రూపాయలు బిల్లులో చేర్చారు.

ఈ భారీ బిల్లును జమీల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ఒక్క రాత్రిలోనే తన బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ రెస్టారెంట్ ప్రపంచ ప్రసిద్ధ టర్కీ షెఫ్ నుస్రత్ గోక్సే (సాల్ట్ బే)కి చెందినది. 2017లో మాంసంపై ఉప్పు చల్లే తన విభిన్న శైలితో ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన ఆయన రెస్టారెంట్లు అత్యంత ఖరీదైనవిగా గుర్తింపు పొందాయి. ఈ ఘటన విలాసవంతమైన హోటళ్లలో ధరల గురించి మరోసారి చర్చకు దారితీసింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *