భారత్ మరియు పాకిస్థాన్ మ్యాచ్‌కు గ్రీన్ సిగ్నల్, పోరుకు ముహూర్తం ఖరారు
February 10, 2026

రాబోయే టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 15న టీమ్ ఇండియాపై తలపడేందుకు పాకిస్థాన్ ప్రభుత్వ తన జట్టుకు అనుమతి మంజూరు చేసింది. ఐసీసీ, బీసీసీఐ, పీసీబీ మరియు శ్రీలంక బోర్డులతో జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం పాక్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని వెలువరించింది. ఈ ప్రకటనతో దాయాదుల పోరుపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడటమే కాకుండా, క్రికెట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
భారత్‌తో మ్యాచ్ ఆడాల్సిందిగా బీసీబీ చేసిన విన్నపం మేరకు పాకిస్థాన్ ప్రభుత్వం ఈ సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 15న షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ యధాతథంగా జరుగుతుందని ఐసీసీ అధికారికంగా స్పష్టం చేసింది. ఈ పరిణామంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులు భారత్-పాక్ మధ్య జరగబోయే హై-వోల్టేజ్ పోరు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.