ఒకేసారి 20 మంది మహిళలను గర్భవతులు చేయాలనుకున్న ఎప్స్టీన్, బయటపడ్డ భయంకరమైన ‘బేబీ రాంచ్’ ప్లాన్

ఒకేసారి 20 మంది మహిళలను గర్భవతులు చేయాలనుకున్న ఎప్స్టీన్, బయటపడ్డ భయంకరమైన ‘బేబీ రాంచ్’ ప్లాన్

అమెరికన్ నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ మరణించిన తర్వాత అతనికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. న్యూ మెక్సికోలోని తన విశాలమైన ఫామ్‌హౌస్‌లో ఒకేసారి 20 మంది మహిళలను గర్భవతులు చేయాలనేది ఇతని ప్రధాన కుట్ర. తన సొంత డీఎన్ఏ ద్వారా ఒక ‘సూపర్ రేస్’ను సృష్టించి, అత్యుత్తమ తెలివితేటలు గల పిల్లలకు జన్మనివ్వాలనేది ఇతని లక్ష్యం. దీని కోసం ఎప్స్టీన్ పలువురు శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరిపాడని, తన వీర్యం ద్వారా మానవ జాతిని ప్రభావితం చేయాలనుకున్నాడని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ ఆలోచన వెనుక ‘ట్రాన్స్‌హ్యూమనిజం’ అనే వింత సిద్ధాంతం దాగి ఉంది. దీని ద్వారా జన్యుపరమైన మార్పులు చేసి మనుషుల శక్తిని పెంచవచ్చని ఎప్స్టీన్ నమ్మేవాడు. విమర్శకుల అభిప్రాయం ప్రకారం, ఈ ధోరణి గతంలో నాజీలు అనుసరించిన సిద్ధాంతాలను పోలి ఉంది. 2000వ సంవత్సరం ప్రారంభంలోనే తన శాంతా ఫే ఫామ్‌హౌస్‌ను ఒక సంతానోత్పత్తి కేంద్రంగా మార్చేందుకు అతను ప్రయత్నించాడు. మహిళలను అక్కడికి రప్పించి, వారిని గర్భవతులను చేయడంపై నిరంతరం చర్చించేవాడని, అయితే ఈ ప్లాన్ పూర్తి స్థాయిలో అమలు జరిగిందా లేదా అనే విషయంపై స్పష్టమైన ఆధారాలు ఇంకా లభించలేదు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *