‘பாகம் பாக் 2’ నుంచి గోవిందా అవుట్! అక్షయ్ సరసన ఆ క్రేజీ నటుడు ఎవరంటే?
February 6, 2026

అక్షయ్ కుమార్ సూపర్ హిట్ కామెడీ చిత్రం ‘భాగం భాగ్’ సీక్వెల్ గురించి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. మొదటి భాగంలో అక్షయ్, గోవిందాల జోడీ అలరించగా, తాజా సమాచారం ప్రకారం సీక్వెల్ నుండి గోవిందాను తొలగించారు. ఆయన స్థానంలో విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయీని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
రాజ్ శాండిల్య దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, పరేష్ రావల్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, మార్చి నుండి ముంబైలో షూటింగ్ ప్రారంభం కానుంది. గోవిందా కామెడీ టైమింగ్‌ను మనోజ్ బాజ్‌పేయీ మ్యాచ్ చేయగలరా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.