ట్రంప్ హెచ్చరికతో వెనక్కి? చాబహార్ పోర్ట్ విషయంలో భారత్ సంచలన నిర్ణయం!
February 6, 2026

ఇరాన్‌లోని వ్యూహాత్మక చాబహార్ ఓడరేవు నుండి భారత్ తప్పుకోనుందా అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన వాణిజ్య ఆంక్షలు, సుంకాల హెచ్చరికల నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది బడ్జెట్లో చాబహార్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం ఈ అనుమానాలకు మరింత ఊతమిచ్చింది. అయితే, అమెరికా ఇచ్చిన మినహాయింపు గడువును పెంచేలా వాషింగ్టన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
మధ్య ఆసియా దేశాలతో వాణిజ్య సంబంధాలకు చాబహార్ అత్యంత కీలకం. అమెరికా ఇచ్చిన గడువు ఏప్రిల్ 26తో ముగియనుండటంతో, భారత్ తన వ్యూహాత్మక ప్రయోజనాలను ఎలా కాపాడుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.