ఆర్జీ కర్ కేసులో ఈడీ సంచలన నిర్ణయం! సందీప్ ఘోష్ సహా ముగ్గురిపై తొలి ఛార్జ్‌షీట్ దాఖలు
February 6, 2026

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆర్థిక అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తొలి ఛార్జ్‌షీట్‌ను సమర్పించింది. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌తో పాటు వెండర్లు బిప్లబ్ సిన్హా, సుమన్ హజ్రా పేర్లను ఇందులో చేర్చారు. సుదీర్ఘ విచారణ అనంతరం మనీలాండరింగ్ కోణంలో ఈడీ ఈ కీలక అడుగు వేసింది.
కోర్టు అక్షింతల నేపథ్యంలో ఈ ఛార్జ్‌షీట్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు, ఈ కుంభకోణాన్ని బయటపెట్టిన అక్తర్ అలీపైనే సీబీఐ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.