షాకింగ్: యువతిపై 20 గంటలపాటు పైశాచికం! ఫేమస్ ఇన్‌ఫ్లుయెన్సర్ ‘నన్సెన్’ షమీక్ అరెస్ట్
February 6, 2026

కోల్‌కతాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ షమీక్ అధికారి అలియాస్ ‘నన్సెన్’ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక యువతిని తన ఇంట్లో 20 గంటల పాటు బంధించి, లైంగిక వేధింపులకు మరియు అత్యాచారానికి పాల్పడినట్లు అతనిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. బెహాలా పోలీసులు ఈ కేసును అత్యంత కీలకంగా దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, షమీక్ తన నేరాన్ని అంగీకరించాడనే వార్తలను పోలీసులు ఖండించారు. నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, కేసు దర్యాప్తు దశలో ఉందని సీనియర్ పోలీస్ అధికారి స్పష్టం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు.