లైంగిక వేధింపుల కేసులో పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్ అరెస్ట్: షమీక్ అధికారికి 10 రోజుల పోలీస్ కస్టడీ
February 6, 2026

లైంగిక వేధింపుల ఆరోపణలతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ షమీక్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం అలీపూర్ కోర్టు అతనికి 10 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఒక యువతిని ఫ్లాట్‌లో బంధించి శారీరకంగా, మానసిక వేధింపులకు గురిచేసినట్లు అతనిపై కేసు నమోదైంది. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న షమీక్‌ను డమ్ డమ్ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తనను కావాలనే ఇరికించారని షమీక్ వాదిస్తున్నప్పటికీ, బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగుతోంది. ఈ అరెస్ట్ రాజకీయంగా కూడా దుమారం రేపుతోంది, తృణమూల్ కాంగ్రెస్ మరియు బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రస్తుతం పోలీసులు పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరిస్తున్నారు.