బోర్డర్ ఫెన్సింగ్ వివాదం: అమిత్ షాకు మమతా బెనర్జీ బిగ్ కండిషన్!
February 6, 2026

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్ కోసం భూసేకరణ విషయంలో కేంద్రంపై మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. బీఎస్ఎఫ్ (BSF) పరిధిని 50 కిలోమీటర్ల నుండి తిరిగి 15 కిలోమీటర్లకు తగ్గిస్తేనే భూమిని ఇస్తామని ఆమె స్పష్టమైన షరతు విధించారు. కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం రాష్ట్ర హక్కులను కాలరాయడమేనని ఆమె మండిపడ్డారు.
తమ ప్రభుత్వం ఇప్పటికే భూమిని కేటాయించిందని, కానీ కేంద్రం తప్పుడు సమాచారం ఇస్తోందని మమత ఆరోపించారు. సరిహద్దు భద్రత కేంద్రం బాధ్యతని, చొరబాట్లకు కేంద్రమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఎస్ఎఫ్ అధికారాల పెంపును ఉపసంహరించుకుంటేనే ఫెన్సింగ్ పనులు ముందుకు సాగుతాయని ఆమె తేల్చి చెప్పారు.