డిజిటల్ పేమెంట్ వినియోగదారులకు శుభవార్త, బడ్జెట్‌లో కీలక నిర్ణయం
February 11, 2026

న్యూస్ డెస్క్ : మీరు గూగుల్ పే లేదా ఫోన్ పే వాడుతున్నారా? అయితే మీకు ఇది నిజంగా ఊరటనిచ్చే వార్త. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇటీవల బడ్జెట్‌లో యూపీఐ మరియు రూపే లావాదేవీల కోసం రూ. 2,000 కోట్ల సబ్సిడీని ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల సాధారణ ప్రజలపై ఎటువంటి అదనపు ఛార్జీల భారం పడదు, డిజిటల్ పేమెంట్స్ అన్నీ గతంలోలాగే పూర్తిగా ఉచితంగా కొనసాగుతాయి.
యూపీఐ లావాదేవీలపై ఫీజు వసూలు చేస్తారనే ప్రచారం సామాన్యులను ఆందోళనకు గురిచేసింది. కానీ ప్రభుత్వం ప్రకటించిన ఈ భారీ సబ్సిడీతో ఆ అనుమానాలకు తెరపడింది. డిజిటల్ ఇండియాను ప్రోత్సహిస్తూనే, సామాన్య పౌరుల జేబుకు చిల్లు పడకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవ వల్ల దేశవ్యాప్తంగా కోట్ల మంది యూపీఐ వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభించింది.