ఒకే భర్త ఇద్దరు భార్యలు, వింత ఆచారంతో వార్తల్లో నిలుస్తున్న భారతీయ గ్రామం

ఒకే భర్త ఇద్దరు భార్యలు, వింత ఆచారంతో వార్తల్లో నిలుస్తున్న భారతీయ గ్రామం

న్యూస్ డెస్క్ : రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లా రామ్‌దేయో గ్రామంలో ప్రతి పురుషుడు ఇద్దరు మహిళలను వివాహం చేసుకోవడం ఒక ఆచారంగా వస్తోంది. మొదటి భార్యకు సంతానం కలగదని లేదా కేవలం ఆడపిల్లలే పుడతారని ఇక్కడి ప్రజల నమ్మకం. వంశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సామాన్య ప్రజలు ఈ వింత పద్ధతిని పాటిస్తున్నారు.

దీనివల్ల అక్కడి కుటుంబాలలో ఒక వింతైన వాతావరణం కనిపిస్తుంది. ఇద్దరు భార్యలు గొడవ పడకుండా అక్కాచెల్లెళ్లలా కలిసి మెలిసి ఉంటారు. చట్టరీత్యా ఇది నేరమైనప్పటికీ, ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. కొత్త తరం వారు ఈ పద్ధతిని వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఈ గ్రామం తన విభిన్నమైన జీవనశైలితో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *