చికెన్ మటన్ లేదా చేపలు, మీ ఆరోగ్యానికి ఏది ప్రమాదకరమో తెలుసుకోండి

చికెన్ మటన్ లేదా చేపలు, మీ ఆరోగ్యానికి ఏది ప్రమాదకరమో తెలుసుకోండి

న్యూస్ డెస్క్ : ప్రోటీన్ కోసం మనం తీసుకునే చికెన్, మటన్ లేదా చేపలు కొన్నిసార్లు మన ప్రాణాల మీదకు తీసుకురావచ్చు. జిమ్ డైట్ లేదా ఇతరుల సలహాల మేరకు మాంసాహారం తీసుకునే ముందు మీ శరీర తత్వాన్ని గమనించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు లేదా కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు చికెన్ తింటే అది మీ ఆరోగ్యాన్ని మరింత క్షీణింపజేస్తుంది.

మటన్ రుచిగా ఉన్నప్పటికీ, అందులో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె జబ్బులు మరియు అధిక రక్తపోటు ఉన్నవారికి ఏమాత్రం మంచిది కాదు. చేపలు మెదడుకు మేలు చేసినప్పటికీ, అలర్జీ ఉన్నవారికి లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇవి ఇబ్బందులు కలిగిస్తాయి. కాబట్టి, కేవలం ప్రోటీన్ కోసం కాకుండా మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆహారాన్ని ఎంచుకోకపోతే, అది మీ జీవనశైలిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *