35 ఏళ్లుగా కడుపులోనే రాయిలా మారిన బిడ్డ, వృద్ధురాలి శరీరంలో వింత ఘటన

35 ఏళ్లుగా కడుపులోనే రాయిలా మారిన బిడ్డ, వృద్ధురాలి శరీరంలో వింత ఘటన

న్యూస్ డెస్క్ : ఒక మహిళ తన కడుపులో ఏకంగా 35 ఏళ్ల పాటు మృత పిండంతో జీవించిందంటే నమ్మగలరా? అల్జీరియాకు చెందిన 73 ఏళ్ల వృద్ధురాలి విషయంలో ఇదే జరిగింది. తీవ్రమైన కడుపు నొప్పితో ఆమె ఆసుపత్రికి వెళ్లగా, వైద్యులు పరీక్షించి షాక్ తిన్నారు. ఆమె కడుపులో 35 ఏళ్ల నాటి ఏడు నెలల పిండం ఉందని, అది సుమారు 2 కిలోల బరువుతో రాయిలా మారిందని గుర్తించారు.

దీనిని వైద్య పరిభాషలో ‘లితోపిడియన్’ లేదా ‘స్టోన్ బేబీ’ అని పిలుస్తారు. గర్భాశయం వెలుపల పిండం ఏర్పడి, రక్త ప్రసరణ లేక అది రాయిలా గట్టిపడిపోతుంది. ఇన్నాళ్లు ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగకపోవడం విశేషం. సాధారణ ప్రజలు తమ ఆరోగ్య విషయంలో, ముఖ్యంగా కడుపు నొప్పి వంటి సమస్యల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన తెలియజేస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *