ట్రంప్ నిర్ణయంతో సామాన్యులకు పండగేనా? భారత ఆర్థిక వ్యవస్థపై పడే 5 సానుకూల ప్రభావాలు
February 4, 2026

ఏక్ జలక్ న్యూస్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం మీ జేబుకు లాభం చేకూర్చనుందా? ప్రధాని మోదీతో చర్చల తర్వాత భారత్‌పై టారిఫ్‌ను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. దీనివల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటి? డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలపడటమే కాకుండా, స్టాక్ మార్కెట్లలో మళ్ళీ జోరు పెరుగుతుంది. దీనివల్ల సామాన్య మదుపరుల పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.
టారిఫ్ తగ్గుదల వల్ల భారతీయ ఎగుమతులు పెరిగి, తయారీ రంగం పుంజుకుంటుంది. విదేశీ పెట్టుబడులు (FDI) భారీగా రావడం వల్ల దేశంలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. రూపాయి విలువ 90 స్థాయికి చేరుకుంటే దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు తగ్గి, ద్రవ్యోల్బణం నుండి సామాన్యులకు ఉపశమనం లభిస్తుంది. మొత్తానికి ఈ అంతర్జాతీయ పరిణామం భారత ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చబోతోంది.