ముస్లిం వ్యాపారికి మద్దతుగా నిలిచిన దీపక్ కు ప్రాణహాని, రాహుల్ గాంధీ భరోసా
February 2, 2026

ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో 30 ఏళ్ల క్రితం ప్రారంభించిన ‘బాబా స్కూల్ డ్రెస్’ అనే ముస్లిం వ్యక్తికి చెందిన దుకాణం పేరుపై వివాదం చెలరేగింది. ఈ క్రమంలో సదరు వ్యాపారికి మద్దతుగా నిలిచిన దీపక్ కుమార్ అనే వ్యక్తికి ప్రస్తుతం చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. మత సామరస్యం కోసం పోరాడుతున్న దీపక్ పై జరుగుతున్న ఈ దాడులు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, దీపక్ కు పూర్తి మద్దతు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా “భయపడవద్దు, మేము నీకు తోడుగా ఉన్నాం” అంటూ ఆయన ధైర్యం చెప్పారు. సమాజంలో ద్వేషాన్ని ఎదిరించే దీపక్ వంటి వ్యక్తులు దేశానికి ఎంతో అవసరమని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.