కాశ్మీర్ మరియు పాకిస్థాన్‌లో తెల్లవారుజామున భూకంపం భయంతో రోడ్లపైకి వచ్చిన ప్రజలు
February 2, 2026

జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఈరోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయాందోళనతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. శ్రీనగర్‌కు సుమారు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న హంజీవేరా బాలా సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
కాశ్మీర్‌తో పాటు పొరుగు దేశమైన పాకిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. అయితే ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.