పార్లమెంట్లో నేడు ఆసక్తికర చర్చ రాష్ట్రపతి ప్రసంగానికి సమాధానం ఇవ్వనున్న రాహుల్ గాంధీ
February 2, 2026

లోక్‌సభలో నేడు మధ్యాహ్నం 12 గంటల నుండి రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు సాగే ఈ చర్చను బీజేపీ తరపున సర్బానంద సోనోవాల్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా తన వాదనను వినిపించనుండటంతో అందరి దృష్టి ఆయనపైనే ఉంది.
బడ్జెట్‌పై పార్లమెంట్లో సమాధానం ఇస్తానని రాహుల్ గాంధీ ఇదివరకే ప్రకటించారు. దీనితో సభలో ప్రభుత్వం మరియు ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ కీలక పరిణామం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.