వరల్డ్ కప్ బరిలోకి పాకిస్థాన్ టీమ్ కానీ భారత్‌తో మ్యాచ్‌కు నో చెప్పిన ప్రభుత్వం

వరల్డ్ కప్ బరిలోకి పాకిస్థాన్ టీమ్ కానీ భారత్‌తో మ్యాచ్‌కు నో చెప్పిన ప్రభుత్వం

వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో తమ క్రికెట్ జట్టు పాల్గొనేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వ ఎక్స్ ఖాతాలో ఈరోజు ఒక ప్రకటన విడుదల చేస్తూ తమ జాతీయ జట్టును ఈ మెగా టోర్నీకి పంపుతున్నట్లు ధృవీకరించింది. దీనితో పాక్ జట్టు భాగస్వామ్యంపై ఉన్న సందిగ్ధతకు తెరపడింది.

కానీ అదే సమయంలో ఫిబ్రవరి 15, 2026న భారత్‌తో జరగాల్సిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఆడబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది. టీమిండియాతో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించడంతో క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. టోర్నీలో ఆడుతున్నప్పటికీ చిరకాల ప్రత్యర్థి భారత్‌తో తలపడకూడదనే ఈ నిర్ణయం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *