హిందూ మతంలోకి ఉర్ఫీ జావేద్? ముస్లిం మతం నుండి బహిష్కరణ వార్తలపై స్పందించిన నటి

హిందూ మతంలోకి ఉర్ఫీ జావేద్? ముస్లిం మతం నుండి బహిష్కరణ వార్తలపై స్పందించిన నటి

బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ మరోసారి మతపరమైన వివాదంలో చిక్కుకున్నారు. ఉర్ఫీ ఇస్లాం నిబంధనలను పాటించడం లేదని, అందుకే ఆమెను ముస్లిం సమాజం నుండి బహిష్కరించాలని నిర్ణయించినట్లు ఇన్‌ఫ్లుయెన్సర్ ఫైజాన్ అన్సారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెకు హిందూ మతాన్ని స్వీకరించాలని సూచించిన ఫైజాన్, ఉర్ఫీ ముస్లిం అయినప్పటికీ ఖురాన్ నియమాలను గౌరవించడం లేదని ఆరోపించారు.

ఈ ఆరోపణలపై ఉర్ఫీ జావేద్ తనదైన శైలిలో స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. తాను ఏ మతానికి కట్టుబడి లేనని, తాను ఒక నాస్తికురాలినని ఆమె స్పష్టం చేశారు. ఏ మత విశ్వాసాలను తాను అనుసరించనని చెబుతూ, మత మార్పిడి వార్తలకు తెరదించారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకే ప్రాధాన్యత ఇస్తానని ఉర్ఫీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *