యవతకు ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ ఒక విషం; బడ్జెట్ నిర్ణయంపై శంకర్ శర్మ కీలక వ్యాఖ్యలు

యవతకు ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ ఒక విషం; బడ్జెట్ నిర్ణయంపై శంకర్ శర్మ కీలక వ్యాఖ్యలు

బడ్జెట్‌లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) పెంచడాన్ని ప్రముఖ ఇన్వెస్టర్ శంకర్ శర్మ సమర్థించారు. డెరివేటివ్స్ అనేవి మన యువత భవిష్యత్తును నాశనం చేసే విషం లాంటివని ఆయన హెచ్చరించారు. ఈ ట్రేడింగ్ వల్ల కలిగే వినాశకరమైన ప్రభావం రాబోయే తరాల మీద పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ వల్ల ఎటువంటి అదనపు విలువ చేకూరదని శర్మ స్పష్టం చేశారు. వీటిని పూర్తిగా నిలిపివేయడం సాధ్యం కానప్పటికీ, భారీగా పన్నులు విధించడం ద్వారా నియంత్రించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ప్రభుత్వ పన్ను పెంపు నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *