ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇప్పుడు బహిర్గతం

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇప్పుడు బహిర్గతం

ఆన్‌లైన్‌లో మనం ఆర్డర్ చేసే ఆహారం ఎంతవరకు తాజాగా ఉంటుందో అనే అంశంపై ఒక వైరల్ వీడియో విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. ఎక్స్ (X) వేదికగా షేర్ చేసిన ఈ వీడియోలో, మనం ఫ్రెష్ అనుకుని తినే ఆహారం నిజానికి వారాల తరబడి ఫ్రీజర్‌లలో నిల్వ ఉంచిన ‘ఫ్రోజన్ ఫుడ్’ అని ఒక వ్యక్తి నిరూపించాడు. పప్పులు, కూరలు, అన్నం మరియు స్వీట్లు కూడా ప్యాకెట్లలో నిల్వ ఉంచి, ఆర్డర్ రాగానే వేడి చేసి కస్టమర్లకు పంపిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

అక్కడ పనిచేసే సదరు వ్యక్తి ఈ ఆహారం పట్ల ప్రజలను హెచ్చరిస్తూ, స్వయంగా హోటల్ సిబ్బంది కూడా వీటిని తినడానికి ఇష్టపడరని తెలిపాడు. ఇలా నిల్వ ఉంచిన ఆహారం వల్ల పోషకాలు నశించడమే కాకుండా ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నాడు. సాధ్యమైనంత వరకు ఇంట్లో వండుకున్న తాజా ఆహారాన్నే తీసుకోవాలని, బయట తినాల్సి వస్తే కళ్ళముందే వండే ప్రదేశాలకు వెళ్లాలని ఆయన ఈ వీడియో ద్వారా సూచించారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *