భీకర ప్రమాదం బాంబులా పేలిన బైక్ ఇద్దరు దుర్మరణం

భీకర ప్రమాదం బాంబులా పేలిన బైక్ ఇద్దరు దుర్మరణం

బ్రెజిల్‌లోని చువిస్కా ప్రాంతంలో గల ‘మరణ వలయం’ వద్ద జరిగిన ఒక ఘోర ప్రమాదంలో ఇద్దరు బైక్ ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అతివేగంతో వెళ్తున్న బైక్ ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొనడంతో క్షణాల్లో బైక్ బాంబులా పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 42 ఏళ్ల దాల్మిర్ మరియు 37 ఏళ్ల జోసియన్ అనే బంధువులు అక్కడికక్కడే మృతి చెందారు. దీనికి సంబంధించిన భయానక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఢీకొన్న ధాటికి కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన బోల్తా పడగా, దానిలోని 72 ఏళ్ల వృద్ధ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మితిమీరిన వేగమే ఈ విషాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాదకరంగా మారిన ఈ మలుపు వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. వేగం ప్రాణాలకు ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *