దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు జరిపిన బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన
February 1, 2026

ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి నివాసం వద్ద శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సుమారు నాలుగు నుంచి ఐదు రౌండ్ల కాల్పులు జరగడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన ముంబై పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
కాగా ఆదివారం సోషల్ మీడియా వేదికగా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ కాల్పులకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పోస్ట్ యొక్క విశ్వసనీయతపై పోలీసులు నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రోహిత్ శెట్టి నివాసం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు మరియు ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.