ఆత్మనిర్భర్ భారత్ మరియు మేక్ ఇన్ ఇండియా దిశగా బడ్జెట్ అడుగులు ప్రధాని మోదీ ధీమా
February 1, 2026

బడ్జెట్ ప్రసంగం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ బడ్జెట్‌లో ‘ఆత్మనిర్భర్ భారత్’ మరియు ‘మేక్ ఇన్ ఇండియా’కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుందని మరియు దేశాన్ని ‘వికసిత భారత్’ వైపు వేగంగా తీసుకెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు ఈ బడ్జెట్‌లో ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ప్రధాని తెలిపారు. సామాన్యులకు ఊరటనిస్తూనే, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు.