బడ్జెట్ 2026 లో వివాహిత దంపతులకు భారీ ఊరట ఇకపై పన్ను ఆదా చేయడం మరింత సులభం

కేంద్ర ప్రభుత్వం రాబోయే 2026 బడ్జెట్లో వివాహిత దంపతుల కోసం ‘జాయింట్ టాక్సేషన్’ విధానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ఈ విధానం అమలులోకి వస్తే భార్యాభర్తలు కలిసి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయవచ్చు. ముఖ్యంగా ఒకరు మాత్రమే సంపాదించే కుటుంబాల్లో, సంపాదన లేని భాగస్వామికి లభించే పన్ను మినహాయింపు పరిమితిని కూడా వినియోగించుకోవడం ద్వారా భారీగా పన్ను ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తుంది.
మరోవైపు, రాబోయే ఐదేళ్లలో పాత పన్ను విధానాన్ని పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి బదులుగా కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 75,000 నుండి రూ. 1 లక్షకు పెంచే అవకాశం ఉంది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఉన్న ఈ జాయింట్ టాక్సేషన్ విధానం భారత్‌లో అమలైతే, పన్ను చెల్లింపుదారుల పని సులభతరం కావడమే కాకుండా పొదుపు కూడా పెరుగుతుంది.