త్వరలో 25,190 ఉద్యోగాల భర్తీ: డిప్యూటీ సీఎం భట్టి
March 19, 2025

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. త్వరలో 25,190 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇందులో 14,236 అంగన్వాడీ పోస్టులు, 10,954 రెవెన్యూ విభాగంలోని గ్రామస్థాయి పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.
అంతేకాకుండా, నిరుద్యోగులకు నాలెడ్జ్ సెంటర్ల ద్వారా గ్రూప్-1, గ్రూప్-2 ఉచిత కోచింగ్ అందించనున్నారు. ఇప్పటికే ఫలితాలు విడుదలైన కొన్ని పరీక్షలకు త్వరలోనే నియామక పత్రాలు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయంతో వేలాది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.