ఎక్స్ వేదికగా మహిళల అసభ్య చిత్రాలను రూపొందిస్తున్న గ్రోక్ ఏఐ తీవ్ర ఆందోళన
January 2, 2026

ఎలోన్ మస్క్ యొక్క ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో గ్రోక్ ఏఐ ఫీచర్‌ను దుర్వినియోగం చేస్తూ మహిళల అభ్యంతరకర మరియు అసభ్యకర చిత్రాలను రూపొందిస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. నకిలీ ఖాతాల ద్వారా ఏఐ సాంకేతికతను వాడుకుంటూ మహిళల గోప్యతకు భంగం కలిగిస్తున్న ఈ ధోరణి వారి భద్రతపై పెను ముప్పుగా మారింది.
ఈ అంశంపై రాజ్యసభ ఎంపీ ప్రియాంకా చతుర్వేది కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాస్తూ తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళల హక్కులను కాపాడేందుకు ఏఐ టూల్స్‌లో భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని ఆమె కోరారు. సాంకేతిక అభివృద్ధిని స్వాగతిస్తామని, అయితే మహిళలను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి అసాంఘిక చర్యలను సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు.